కరోనా కేసులు పెరగడానికి సీఎం కారణం

by Ramesh Goud |
bhatti vikramarka
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగేందుకు సీఎం కేసీఆర్​కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్​అయ్యారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసిందని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్​ఎన్నికలను వద్దన్నా నిర్వహించారని దుయ్యబట్టారు. దీంతో వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో పాజిటవ్​కేసులు పెరిగాయని, మరణాలు కూడా ఎక్కువయ్యాయని ఆరోపించారు. వీటిపై ఆధారాలతో త్వరలోనే ఫిర్యాదు చేస్తామన్నారు.

సీఎం కేసీఆర్ రాజకీయ క్రీడలు పక్కన పెట్టి ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలని, కనీసం 15 రోజులైనా లాక్‌డౌన్ పెట్టాలని సూచించారు. కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్‌ పెట్టాలని డిమాండ్ చేశారు. హోటల్స్ స్వాధీనం చేసుకుని క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చాలని, ప్రతి పీహెచ్‌సీలో 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క ప్రభుత్వానికి సూచించారు.

Next Story

Most Viewed