- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొండపోచమ్మ ప్రారంభోత్సవానికి..చినజీయర్‌కు ఆహ్వానం
by Shyam |

X
దిశ, న్యూస్ బ్యూరో
కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవ వేడుకలకు రావాల్సిందిగా త్రిదండి చిన జీయర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ ఆశ్రమానికి బుధవారం సాయంత్రం మంత్రులతో కలిసి స్వయంగా వెళ్ళిన కేసీఆర్ ఈ నెల 29న ఉదయం జరిగే ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. కొండపోచమ్మ ఆలయంలో చండీయాగం, ఆ తర్వాత పంప్ హౌజ్ దగ్గర సుదర్శన యాగం నిర్వహించనున్నందున ఆ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చిన జీయర్ నుంచి ముఖ్యమంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు.
Next Story