- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐటీ టవర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. రూ.45 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐటీ టవర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలకు సీఎం కేసీఆర్ శుభాభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ సమక్షంలో నాలుగు ఐటీ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రానుందని చెప్పారు.
ఇక సిద్దిపేటలో తెలంగాణ భవన్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అ తర్వాత మిట్టపల్లిలో రైతుల వేదికను ప్రారంభించారు. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 960 పడకల జనరల్ ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.