కొనుగోలు కేంద్రాలపై సీఎం కేసీఆర్ క్లారిటీ

by Anukaran |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు ఎలాంటి అసౌఖర్యాలు కలుగకుండా అన్ని గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం బీఆర్ కేఆర్ భవన్ నుంచి సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరిత హారం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌లు, ధరణి, కోవిడ్ -19, వరి ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. రైతు వేదికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు, ఎన్‌ఆర్‌ఈ‌జేఎస్ ద్వారా గ్రామాల్లో ప్రస్పుటంగా కనిపించే, మన్నికైన ఆస్తులను కల్పించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లు పంచాయతీ రాజ్ శాఖ అధికారులను సీఎం కేసిఆర్ అభినందించారు.

ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆయన కోరారు. ప్రతి మండలానికి చెందిన స్పెషల్ ఆఫీసర్ నర్సరీలను సందర్శించి మొక్కలు బతికేలా చూడాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కోసం అనువైన స్థలాలను వ్యక్తిగతంగా పరిశీలించి ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాబోయే ఆరు నెలల్లో ఈ మార్కెట్లను పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. ధరణిలో చేసిన అద్భుతమైన కృషికి కలెక్టర్లను అభినందించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా క్లియర్ చేయాలని కోరారు.

కోవిడ్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలకు కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడాన్ని అమలు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story