జలవనరుల శాఖ స్వరూపాన్ని ఖరారు చేసిన కేసీఆర్

by Shyam |   ( Updated:2020-12-28 08:01:22.0  )
జలవనరుల శాఖ స్వరూపాన్ని ఖరారు చేసిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రగతిభవన్‌లో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సోమవారం సమావేశమైన సీఎం.. నీటిపారుదల రంగంలో మార్పులకు అనుగుణంగా జలవనరులశాఖను పునర్‌వ్యవస్థీకరించి, జలవనరులశాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. ఒకే గొడుగు కింద భారీ, మధ్య, చిన్న తరహా విభాగాలు ఉంటాయని, ఒకే చోట ఉన్నఅన్నిరకాల జలవనరులశాఖ వ్యవహారాలు ఒకే అధికారి పర్యవేక్షణలో ఉంటుందని స్పష్టం చేశారు. పునర్‌వ్యవస్థీకరణకు అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచుతామని, రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ప్రాదేశిక ప్రాంతం బాధ్యతలు ఒక్కో సీఈకి, ఆరుగురు ఈఎన్సీలను నియమించి వారికి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు.

జనరల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు ప్రత్యేక ఈఎన్సీలు, ఆపరేషన్, మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేక ఈఎన్సీలు, ప్రాదేశిక సీఈల స్థానంలో ముగ్గురు అధికారులకు ఈఎన్సీ కేడర్ బాధ్యతలు ఉంటాయన్నారు. కొత్తగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరు చేస్తున్నట్లు తెలిపిన సీఎం కేసీఆర్.. సీఈ పోస్టులు 19నుంచి 22కు, ఎస్ఈ పోస్టులు 47నుంచి 57కు, ఈఈ పోస్టులు 234కు, డీఈఈ పోస్టులు 892కు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఏఈఈ పోస్టులు 2,796, టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్య 199కి పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేసిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి, ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగా కొద్దిపాటి లింకులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed