రేపు ‘శ్రీశైలం’ సందర్శనకు సీఎం జగన్

by srinivas |
రేపు ‘శ్రీశైలం’ సందర్శనకు సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 4.29 లక్షల క్యూసెక్యుల వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. త్వరలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉండటంతో అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883 అడుగులకు చేరుకుంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 206 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో అదనంగా మరో 70,948 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 1.36 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Advertisement

Next Story