రేపు తిరుమల రానున్న సీఎం జగన్

by srinivas |
రేపు తిరుమల రానున్న సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్.. ఇవాళ రాత్రి ప్రధాని మోడీతో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పరిణామాలతో పాటు, నిధుల విడుదల గురించి ప్రధానితో జగన్ చర్చించనున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో నేరుగా తిరుపతి చేరుకొని శ్రీవారికి పట్టవస్త్రాలు సమర్పించి రాత్రికి అక్కడే బస చేస్తారని సీఎంవో వెల్లడించింది. గురువారం ఉదయం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కొత్తగా నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed