- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి : భట్టి
దిశ, మధిర: కరోనా కష్ట కాలాన్ని అత్యవసర సర్వీస్ కింద ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివాసం ఆయన రాష్ట్ర కాంగ్రెస్, కరోనా టాస్క్‌ఫోర్స్ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన స్పీకర్ తెలంగాణ కార్యక్రమంలో ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. ఈ సందర్భంగా మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా పేషెంట్లను ఆరోగ్య శ్రీలో చేర్చాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 50 శాతం బెడ్స్ ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకోవాలని, ఆసుపత్రి ఖర్చులు ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరోనా హోమ్ క్వారంటైన్‌లకు జిల్లా హెడ్ కోటర్స్‌లో 50% బెడ్లు అందుబాటులో ఉంచాలని అదేవిధంగా కరోనా వైద్యం చేస్తున్న డాక్టర్లు, పారామెడికల్స్ దురదృష్టవశాత్తు ఎవరన్నా మరణిస్తే ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అన్నారు. కరోనా మూలంగా ఎవరైనా మరణిస్తే ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కరోనా కష్టకాలం అత్యవసర సర్వీసుల కింద ప్రభుత్వం ప్రకటించి, ప్రజల బతకడానికి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.