- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలా చెప్పడం హాస్యాస్పదం: భట్టి విక్రమార్క
దిశ ప్రతినిధి, ఖమ్మం : తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకే రైతు చట్టాలపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మధిరలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రైతు వ్యతిరైక నిర్ణయాల పట్ల మేధావులు, యువత, నిరుద్యోగులు ముందుకు కదలాలని అన్నారు. కేంద్రం రైతు చట్టాలు అత్యంత దుర్మార్గమైనవిగా, వాటిపై పోరాటం చేస్తానన్న సీఎం.. తీరా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీకి జై కొట్టారన్నారు. తన ఆర్థిక సామ్రాజ్యంపై జరిగే దాడులకు భయపడే రాష్ట్ర రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కేంద్రానికి కేసీఆర్ పణంగా పెట్టారని విమర్శించారు. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయదని సీఎం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 17న ఖమ్మంలో 5 కిలోమీటర్ల మేర జూబ్బీ క్లబ్ నుంచి శ్రీశ్రీ సర్కిల్ వరకు మహా మానవహారం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇందులో విద్యార్థులు, రైతు నాయకులు అందూ పాల్గొనేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కిషోర్, కార్పొరేటర్ వాసు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేణు, తదితరులు పాల్గొన్నారు.