హెచ్ఎండీఏ పరిధిలోని పార్కులు మూసివేత

by Shyam |
హెచ్ఎండీఏ పరిధిలోని పార్కులు మూసివేత
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రదేశాలు, పార్కులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) పరిధిలోని పలు ప్రదేశాల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూపార్క్, మ్యూజియంలు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ మెమోరియల్, సంజీవయ్య పార్క్‎, ఇందీరా పార్కులు ఈ నెల 21వ తేదీ వరకు మూతపడనున్నాయి. అదే విధంగా నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా సభలు, సమావేశాలకు అనుమతి రద్దు చేశారు.

Tags: carona effect, HMDA, Closure of Parks, hyderabad

Next Story

Most Viewed