- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంటర్ ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్ పరీక్షల ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఫలితాలను రిలీజ్ చేయాలని రాష్ట్రాల బోర్డులను గురువారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటర్నల్ మార్కులు, గ్రేడింగ్ అసెస్మెంట్ కోసం 10 రోజులు సమయాన్ని ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలోని 21 రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు రద్దు కాగా.. మరో 6 రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల బోర్డుల మాదిరిగానే సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ ఫలితాలను జులై 31లోగా వెల్లడించాలని పేర్కొంది. అయితే, గత వారమే ఈ రెండు బోర్డులు కూడా మార్కులు వేసే విధానాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించాయి. ఈ నేపథ్యంలో బోర్డులు పంపిన మార్కుల విధానంపై సంతృప్తి వ్యక్తం చేసింది. గురువారం విచారణలో భాగంగా పై వ్యాఖ్యలు చేసింది.
Next Story