అనంతపురం జిల్లాలో టెన్షన్ టెన్షన్

by srinivas |   ( Updated:2023-05-19 12:49:50.0  )
అనంతపురం జిల్లాలో టెన్షన్ టెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్యకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు ఘర్షణకు దారి తీశాయి. అయితే జేసీ వర్గీయులే పోస్టు పెట్టారని ఆగ్రహించిన పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన ఇంట్లో లేరు. అదే క్రమంలో జేసీ ఇంట్లోని అనుచరులపై పెద్దారెడ్డి దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వకున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న జేసీ వర్గీయులు పెద్దారెడ్డి కారును ధ్వంసం చేయగా.. పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ వినకుండా రోడ్డుపై ఆందోళన చేపట్టడంతో పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. జేసీ వర్గీయులు పరుగులు తీస్తూనే డీఎస్పీ వాహనాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed