- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గణపతి నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ.. కర్రలతో దాడి
X
దిశ, అల్వాల్ : గణపతి నిమజ్జన ఊరేగింపులో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్న ఘటన మంగళవారం రాత్రి అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్మత్‌పేట్ చెరువులో గణపతి నిమజ్జనానికి వరుసగా విగ్రహాలు ఊరేగింపుగా వస్తున్నాయి.
అంజయ్యనగర్ బస్తీలో ముందుగా ఊరేగింపుగా వెళ్తున్న వారిని వెనుక నుంచి వస్తున్న మరో విగ్రహ భక్తలు.. పక్కకు జరగండి మేము వెళ్తాము అంటూ చెప్పడంతో మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు కర్రలతో దాడిచేసుకున్నారు. దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు చెప్పినా వినకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. అనంతరం చెరువు వద్ద ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా మరింత బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
Advertisement
Next Story