విద్యార్థులకు గమనిక : రేపు మధ్యాహ్నం 3 గంటలకు ICSE, ISC ఫలితాలు

by Shyam |
students
X

దిశ, వెబ్‌డెస్క్ : కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) విద్యార్థుల పరీక్షా ఫలితాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. శనివారం మధ్యాహ్నం3 గంటల ప్రాంతంలో 10, 12 తరగతుల విద్యార్థుల కోసం ICSE మరియు ISC ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపింది. ఫలితాలు cisce.org మరియు results.cisce.org లో చూసుకోవచ్చని చెప్పింది. అంతేకాకుండా SMS ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంచబడతాయని పేర్కొంది. అయితే, టాబ్యులేషన్ రిజిస్టర్లను కౌన్సిల్‌కు చెందిన CAREERS పోర్టల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చునని వెల్లడించింది.

Next Story

Most Viewed