లవ్‌లో పడ్డానంటూ యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. మెగా హీరోతోనేనా అంటున్న నెటిజన్లు

by Kavitha |
లవ్‌లో పడ్డానంటూ యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. మెగా హీరోతోనేనా అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామ కుర్రాళ్ల మనసులు దోచేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మెప్పించింది. కానీ, అనుకున్నంత స్టార్ డమ్ అయితే తెచ్చుకోలేక పోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి సోషల్ మీడియాకే పరిమితం అయింది. ఇక నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని.. ఫుకెట్ లోని గ్రీన్ ఎలిఫెంట్ అభయారణ్యం పార్క్‌కి వెళ్లింది. అక్కడ ఏనుగులతో ఫొటోస్ కూడా దిగింది. ఇక ఆ పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘ఎలిఫెంట్‌తో లవ్‌లో పడ్డా’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు లవ్‌లో పడ్డది మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తోనేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ లవ్‌లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు పుకార్లు నెట్టింట షికార్లు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story