- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Madhavi Latha: కరివేపాకు గాళ్లు మీకే అంతుంటే అల్లు అర్జున్‌కు బలుపు ఉంటే తప్పేంటి.. హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు (వీడియో)
దిశ, సినిమా: ‘పుష్ప-2’(Pushpa 2: The Rule ) ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద ఓ విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వల్ల తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో.. అల్లు అర్జున్(Allu Arjun) సంధ్య థియేటర్‌కు రావడం వల్లే ఆమె చనిపోయిందని ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. కానీ బెయిల్‌పై బయటకు వచ్చేసినప్పటికీ ఇటీవల మరోసారి పోలీసులు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఐకాన్ స్టార్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా, ఈ విషయం టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత(Madhavi Latha) రియాక్ట్ అయి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘సోషల్ మీడియా(Social Media)లో ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్‌కు ఎంత యాటిట్యూడ్(Attitude).. ఎంత పొగరు. పైకి, కిందకు, పక్కకు చూశాడు. అబ్బబ్బా ఆ కళ్లల్లో ఎంత యాటిట్యూడ్ ఉంది. ఎంత బలుపు.. అని ఒకటే పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. అరెయ్ అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ కాదురా డైమండ్ స్పూన్‌తో పుట్టాడు. అతనికి యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటి. ఏమీ లేని వేపాకు, కరివేపాకు గాళ్లు మీరు మీకే బలుపు ఉంటే.. అతన్ని కామెంట్ చేస్తున్నావ్ నీ దగ్గర ఏముంది. నువ్వంత యాటిట్యూడ్ చూపించడానికి ఎదుటివాళ్ళని జడ్జ్ చేయడానికి నీకేం హక్కు ఉంది. 10 ఏళ్ల క్రితం అనుకుంట రామ్ చరణ్‌ది ఓ ఇంటర్వ్యూ చూశా.. మీకెందుకు ఇంత యాటిట్యూడ్ అనడిగితే ఎందుకుండకూడదు అన్నాడు.
నిజమే కదా.. ఎందుకు ఉండకూడదు.. చిరంజీవి కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు.. అలానే అల్లు అరవింద్ కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు.. ఏ మీరు చూపిస్తే యాటిట్యూడ్ కానిది అల్లు అర్జున్ చేస్తే ఎలా అవుతుంది. అయినా ఇప్పుడు ప్రతిదీ స్లో మోషన్‌లో పెట్టి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. దించుతాం మేము బలుపు దించుతాం అంటూ పోస్టులు పెడుతున్నారు.. ఏందిరా మీరు దించేది మీకు ఏం చేతకాదు.. అల్లు అర్జున్(Allu Arjun) యాంటీ ఫ్యాన్స్ ఇలా అంటారు.. మళ్లీ మీ ఫేవరెట్ హీరో మీకు దేవుడై పోతాడు.. అదేందో మరి’’ అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.