Vishwak Sen: ప్రతిసారి తగ్గను.. మళ్లీ చెప్తున్నా అలా చేయకండి అంటూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ విశ్వక్ సేన్ వార్నింగ్

by Hamsa |
Vishwak Sen: ప్రతిసారి తగ్గను.. మళ్లీ చెప్తున్నా అలా చేయకండి అంటూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ  విశ్వక్ సేన్ వార్నింగ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్, రామ్ నారాయణ్ (Ram Narayan)కాంబినేషన్‌లో ‘లైలా’ మూవీ రాబోతుంది. ఇందులో ఆకాంక్షశర్మ (Akanksha Sharma)హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని పోస్టర్స్, టీజర్, ట్రైలర్ భారీ హైప్‌పు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌తో నటిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ఇటీవల ‘లైలా’(Laila) ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

అయితే ఇందులో పృథ్వీ చేసిన రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైసీపీ నేతలు ‘లైలా’ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా పలు పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. లైలా నిర్మాత సాహు గారపాటి, విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తనతో ఎలాంటి సంబంధం లేదని ఇందులో అతని డైలాగ్స్ కూడా లేవని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ ‘లైలా’(Laila)సినిమాపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఈ విషయంపై మరోసారి విశ్వక్ సేన్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ‘‘నా సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్.. నా చిత్రందే. మూవీస్ పోస్టర్స్, పోస్ట్‌లను షేర్ చేసే ప్రతిసారీ రెండుసార్లు ఆలోచించలేను. ఈ ఫొటోలో ఉంది సోనూ మోడల్.

ఫిబ్రవరి 14న మీ ముందుకు వస్తున్నాడు. నా సినిమాకు బాయ్‌కాట్ లైలా హ్యాష్ ట్యాగ్‌తో నెట్టింట కొంతమంది చాలా పోస్టులు పెడుతున్నారు. నేను ప్రతిసారి తగ్గను. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జరిగిన దానికి నేను నిన్న మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. అతిగా ఆలోచించి నెగెటివ్‌గా మాట్లాడకండి.. ప్రశాంతంగా ఉండండి. మళ్లీ చెబుతున్నాను. నేను నటుడిని మాత్రమే నన్ను నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు’’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా లైలా పోస్టర్‌తో పాటు మిడిల్ ఫింగర్ చూపిస్తున్న ఫొటో కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story

Most Viewed