Bigg Boss 8 Telugu: గ్రాండ్ ఫినాలే వరకు బిగ్ బాస్ ఇంట్లో నిలవలేకపోయిన విష్ణు ప్రియ

by Prasanna |   ( Updated:2024-12-09 07:52:58.0  )
Bigg Boss 8 Telugu: గ్రాండ్ ఫినాలే వరకు బిగ్ బాస్ ఇంట్లో నిలవలేకపోయిన విష్ణు ప్రియ
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ( Bigg Boss Telugu Season 8) ముగింపు దశకు వచ్చింది. ఈ వారం చివరలో ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్‌ను డిసైడ్ చేయడానికి డిసెంబర్ 8 రాత్రి 10:30 గంటల నుంచి ఓటింగ్ పోల్ ఓపెన్ అయింది. ఇదిలా ఉండగా.. ఆదివారం ఎవరు ఉహించలేని విధంగా విష్ణు ప్రియ ( Vishnupriya) ఎలిమినేట్ అయింది. విన్నర్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, గ్రాండ్ ఫినాలేకు వెళ్ళకుండానే బయటకు వచ్చేసింది. సీజన్ స్టార్టింగ్ లో ఆమె ఆట, మాట తీరుతో అందర్నీ మెప్పించింది. పృథ్వీరాజ్‌తో లవ్ ట్రాక్ ఈమెకి మైనస్ అయింది. పృథ్వీ ఆమెను ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాడు. కానీ విష్ణు ప్రియ మాత్రం లవర్ గా అనుకోవడంతో గేమ్ మీద దృష్టి పెట్టలేకపోయింది. దాని ఫలితంగా ఓటింగ్ శాతం కూడా తగ్గి ఆదివారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.

Advertisement
Next Story

Most Viewed