వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పోతుంది, అది అంత ముఖ్యమైన విషయం కాదు.. మహేష్ బాబు హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

by Kavitha |
వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పోతుంది, అది అంత ముఖ్యమైన విషయం కాదు.. మహేష్ బాబు హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(PRIYANKA CHOPRA) మనందరికీ సుపరిచితమే. తమిళ చిత్రసీమ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలు అందుకుంటూ బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి, మెప్పించింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అతి తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్‌గా నిలిచింది.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్‌(Hollywood)లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. గ్లోబల్‌ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక హాలీవుడ్ స్టార్ నిక్ జోనస్(Nick Jonas) ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ నేషనల్ స్టార్‌గా ఉన్న అమ్మడు .. ఇప్పుడు హాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారింది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కబోతున్న మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాజీ ప్రపంచ సుందరి సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘చాలామంది వ్యక్తులు తమ భార్యలు వర్జీన్‌గా రావాలని కోరుకుంటారు. కానీ వర్జిన్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదు. వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పోతుంది. దానికోసం పెద్దగా పట్టించుకోవద్దు. అర్థం చేసుకుని నచ్చిన విధంగా ఉండే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకోవాలి. ఎందుకంటే మంచి చెడు అనేది మనిషి ముఖం మీద కనిపించదు.

ఒక అమ్మాయి ఒక మగాడిని నమ్మితే ఏదైనా చేస్తుంది. కానీ కలిసిన ప్రతి జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని లేదు. అందుకు అద‌ృష్టం ఉండాలి. అది వర్కౌట్ అవ్వనప్పుడు ఇంకొకరితో జీవితం పంచుకుంటాం. అలాంటప్పుడు వర్జినిటీ గురించి పట్టించుకోవద్దు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story