Vikwak Sen: లైలా & సోను వినోదం వేరే లెవల్ ఉంటోంది.. వైరల్‌గా డబుల్ మీనింగ్ డైలాగ్స్

by sudharani |
Vikwak Sen: లైలా & సోను వినోదం వేరే లెవల్ ఉంటోంది.. వైరల్‌గా డబుల్ మీనింగ్ డైలాగ్స్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రామ్ నారాయణ్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. పాజిటివ్ అంచనాల మధ్య ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

‘లైలా అండ్ సోను మోడల్‌తో వినోదం అండ్ హాస్యం వేరే లెవల్‌లో ఉంటోంది’ అనే క్యాప్షన్ ఇస్తూ షేర్ చేసిన ట్రైలర్‌లో.. లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతున్న బార్బర్ సోను (విశ్వక్) అనుకోకుండా ఓ గొడవలో చిక్కుకుంటాడు. ఈ క్రమంలోనే విశ్వక్‌ను పంచేందుకు మనుషులు వెంటపడతారు. వారు నుంచి తప్పించుకునే ప్రయత్నంగా సోను లైలా అనే లేడీ గెటప్‌లోకి మారతాడు. ఇక లేడీ గెటప్‌లోకి చేంజ్ అయిన తర్వాత విశ్వక్ ఎదురయ్యే పరిస్థితులు నవ్వులు పూయించే విధంగా ఉంటాయి. అంతే కాకుండా.. ట్రైలర్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఉండగా.. మాస్ కామెడీ యాంగిల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుటోంది.

Next Story