- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Vennela Kishore: గర్భగుడి వెల్‌నెస్ సెంటర్ పెట్టిన వెన్నెల కిషోర్.. వైరల్‌గా మారిన పోస్ట్

దిశ, సినిమా: విక్రాంత్ (Vikrant), చాందినీ చౌదరి (Chandni Chaudhary) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santana Praptirastu). సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల సంక్రాంతి స్పెషల్‌గా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. హీరో (విక్రాంత్), హీరోయిన్ (చాందినీ చౌదరి) మధ్యలో ఓ పెద్ద పెగ్రెన్సీ కిట్ ఉన్న ఫొటోను రివిల్ చేయగా ఈ సినిమా కథ మొత్తం ‘సంతానం’ చుట్టూ తిరుగుతోందని అర్థం అవుతోంది.
ఇందులో భాగంగా తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో వెన్నెల కిషోర్ (Vennela Kishore) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడని తెలుస్తుండగా.. తన పాత్రకు రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు వెన్నెల కిషోర్. ‘గర్భ గుడి వెల్‌నెస్ సెంటర్‌కి చెందిన డాక్టర్ భ్రమరామ్ (Dr. Bhramaram) పాత్రలో నటించడం నాకు చాలా నచ్చింది. సంతానప్రాప్తిరస్తు ప్రపంచంలో సైన్స్, ఆయుర్వేదం అండ్ పెద్ద మొత్తంలో నవ్వులని అందిచడానికి వస్తున్నాడు ఈ వైద్యుడు’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్‌లో వెన్నెల కిషోర్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.