భారీ ప్రమాదం నుంచి బయటపడ్డ వెంకటేష్ హీరోయిన్.. హృదయం బరువెక్కిందంటూ ఎమోషనల్ ట్వీట్

by Hamsa |
భారీ ప్రమాదం నుంచి బయటపడ్డ వెంకటేష్ హీరోయిన్.. హృదయం బరువెక్కిందంటూ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి ప్రీతి జింటా(Preity Zinta ) తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా వెంకటేష్‌తో ‘ప్రేమంటే ఇదేరా’(Premante Idera) చిత్రంతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం పలు పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా, ఈ అమ్మడు భారీ ప్రమాదం నుంచి బయటపడింది.

అమెరికా(America)లోని లాస్ ఎంజెల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు ఘటన జరగడంతో ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘‘లాస్ ఎంజిల్స్‌(Los Angeles)లో మా చుట్టూ ఉన్న వారిని మంటలు నాశనం చేసే రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నేను బతికుండగా ఇలాంటి విషాదం చూస్తానని అనుకోలేదు. నా స్నేహితులు, కుటుంబాలు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మన చుట్టూ ఉన్నవారికి జరిగిన విధ్వంసం చూసి నా హృదయం బరువెక్కింది.

అక్కడి విధ్వంసం చూస్తుంటే ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి విషాద సమయంలో మేము సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మంటల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గాలి త్వరలోనే తగ్గి మంటలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నా. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి సహాయం చేస్తున్న అగ్నిమాపక శాఖ, సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చింది.

Next Story

Most Viewed