పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. షాకింగ్ లుక్‌లో దర్శనమివ్వడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే!

by Hamsa |
పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. షాకింగ్ లుక్‌లో దర్శనమివ్వడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘ఆర్ఎక్స్ 100’(RX 100) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇందులో విభిన్నంగా నటించిన ఆమె తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా ఆ ఆ తర్వాత ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన ‘వెంకీ మామ’ సినిమాలో నటించింది. అలా తీస్ మార్ ఖాన్, డిస్కో రాజా అనగనగా ఓ అతిథి, జిన్నా, రక్షణ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక 2023లో పాయల్ నటించిన ‘మంగళవారం’(Mangalavaaram) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మాడు క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘వెంకట లచ్చిమి’ (Venkata Lachmi)సినిమాలో నటిస్తోంది. ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏకంగా ఆరు భాషల్లో విడుదల కాబోతుంది. పాయల్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. వరుస ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో బ్లూ కలర్ లెహంగా ధరించిన ఆమె మెహందీ పెట్టుకుని మెరిసిపోయే లుక్‌లో కనిపించింది. అలాగే నగలు ధరించి సిగ్గుపడుతూ అచ్చం పెళ్లి కూతురిలా దర్శనమిచ్చింది. ఇక ఈ ఫొటోలు చూసిన వారంతా చాలా అందంగా ఉన్నావు పెళ్లి పీటలెక్కబోతుంది అందుకే ఇలా రెడీ అయిందని అంటున్నారు. కాగా, ఈ అమ్మడు గత కొద్ది కాలంగా పంజాబీ నటుడు సౌరభ్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే వీరిద్దరు నిత్యం పలు వెకేషన్స్‌ను వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పలు రొమాన్స్ వీడియోలను కూడా పెట్టి నెట్టింట రచ్చ చేస్తుంటారు.

Next Story