ట్రెడిషనల్ వేర్‌లో ఆకట్టుకుంటున్న టిల్లు బ్యూటీ.. వావ్ సూపర్ అంటున్న నెటిజన్లు

by Kavitha |
ట్రెడిషనల్ వేర్‌లో ఆకట్టుకుంటున్న టిల్లు బ్యూటీ.. వావ్ సూపర్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: హీరోయిన్ నేహా శెట్టి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ భామ ‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘రూల్స్ రంజన్’, ‘బెదురు లంక’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ‘డీజే టిల్లు’ మూవీలో రాధిక క్యారెక్టర్‌లో నటించి ఏకంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు తడుతున్నాయి. అలా ఇటీవల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో నటించి అలరించింది. అలాగే ‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘టైసన్ నాయుడు’ అనే చిత్రంతో మన ముందుకు రానున్నది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా నేహా శెట్టి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ప్యారెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ మిక్స్ అయిన చీర కట్టుకొని, బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని ట్రెడిషనల్ వేర్‌లో ఫొటోలకి పోజులిచ్చింది. అయితే ఈ పిక్స్ బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే ఎవరిదో పెళ్లికి ఇలా సంప్రదాయకంగా రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి టిల్లు బ్యూటీపై మీరు ఓ లుక్ వేసేయండి.

Next Story

Most Viewed