ఒకే సినిమాలో ముగ్గురు అగ్ర హీరోలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం.. (ట్వీట్)

by Hamsa |
ఒకే సినిమాలో ముగ్గురు అగ్ర హీరోలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం.. (ట్వీట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో కార్తి(Karthi) తెలుగు, తమిళం అనే తేడా లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా తనకు నచ్చిన కథలు ఓకే చేస్తూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక గత ఏడాది ‘సత్యం సుందరం’(Satyam Sundaram) సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కార్తీ సర్దార్-2(Sardar-2), ఖైదీ-2 చిత్రాల్లో నటిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలు సీక్వెల్స్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ‘ఖైదీ-2’ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రాబోతుండటంతో అంతా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఖైదీ’ సీక్వెల్‌గా రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ఖైదీ-2’ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ఇందులో కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్(Kamal Haasan), సూర్య, ఫహద్ ఫాసిల్(Fahadh Faasil) గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇక దళపతి విజయ్(Thalapathi Vijay) ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇప్పించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో .. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు హీరోల అభిమానులు ఫుల్ ఖుషీ అవడంతో పాటు పూనకాలు రావడం ఖాయం అంటున్నారు.

Next Story

Most Viewed