Brahmaji: వాటికి అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు.. బ్రహ్మాజీ ట్వీట్

by Hamsa |
Brahmaji: వాటికి అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు.. బ్రహ్మాజీ ట్వీట్
X

దిశ, సినిమా: కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలా మంది థియేటర్స్‌కు వెళ్లడం మానేశారు. ఇక వెళ్లినా కొందరు మాత్రం ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్తే పాప్‌కార్న్ ఖర్చులే ఎక్కువుగా అవుతుండటంతో ఓటీటీలోనే చూసేస్తున్నారు. తాజాగా, ఇదే విషయంపై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) వరుస ట్వీట్లు వేసి వార్తల్లో నిలిచాడు. పీవిఆర్‌(PVR)లో మూడు పాప్‌కార్న్, ఒక వాటర్ బాటిల్ ఖర్చు రూ.1300 అవుతాయని రాసుకొచ్చాడు. దీనికి ఓ నెటిజన్ మీరు భరించగలరు సార్!! నేను చేయలేను!! ఐదేళ్ల నుంచి థియేటర్లకు వెళ్లడం మానేసింది. నేను పాప్‌కార్న్ లేకుండా సినిమా చూడలేను కాబట్టి హైదరాబాద్‌‌లో వెళ్లలేదు. మీరు వాటిని కొనుక్కుని తినగలిగే స్థాయి ఉంటుంది. అందుకే నేను మల్టీఫ్లె‌క్సు(Multiplex)ల్లోకి వెళ్లడమే మానేశాను అని పెట్టాడు. దీనికి బ్రహ్మాజీ ఇక్కడ కొనగలిగే స్థాయి గురించి కాదు.. వాటికి అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు.. అది అంత వర్త్ కాదు’’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed