41 సంవత్సరాల వయసులోనూ కేక పుట్టిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆ డ్రెస్‌లో వావ్ అనిపిస్తుందిగా

by Kavitha |
41 సంవత్సరాల వయసులోనూ కేక పుట్టిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆ డ్రెస్‌లో వావ్ అనిపిస్తుందిగా
X

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలా ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 7 సినిమాలకు పైనే ఉన్నాయి. ఇక పర్సనల్ విషయానికి వస్తే.. కెరీర్ స్టార్టింగ్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)తో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ వీటిపై ఈ ఇద్దరూ స్పందించకపోవడం, తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో ఆ వార్తలకు చెక్ పడింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి(Vijay Dalapathi)తో ప్రేమలో ఉన్నట్లు కొన్ని పుకార్లు నెట్టింట షికార్లు చేస్తుంది. అంతేకాకుండా వీరిద్దరూ చాలా చోట్ల రెడ్ హ్యాండెడ్‌గా కూడా పట్టుబడ్డారు. అలాగే ఇప్పటి వరకు ఏ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయని ఈ భామ విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది. దీంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఇక రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh)- ఆంటోని తటిల్(antony Thatil) మ్యారేజ్‌కు వెళ్తున్నప్పుడు కూడా ఎయిర్ పోర్ట్‌లో మీడియాకు చిక్కిన విషయం విదితమే.

ఇదిలా ఉంటే.. ఓ పక్కా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో మెరూన్ కలర్ సూట్ వేసుకుని కిర్రాక్ అనిపించింది.

బేసిక్‌గా ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది గ్లామర్ తగ్గుతుంది కానీ, ఈ బ్యూటీ అందం అంతకంతకు పెరుగుతోంది అనే చెప్పాలి. 41 ఏజ్‌లోనూ వావ్ అనిపిస్తుంది. ఇక ఈ ఫొటోలకు ‘వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్, ఫర్ మై సెల్ఫ్, బై మై సెల్ఫ్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నా గార్జియస్ క్వీన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed