- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘మేము అందరినీ మా సొంతం చేసుకోవాల్సిన సమయం వచ్చింది’.. టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadri Express) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు తలుపు తట్టడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బ్యూటీ కచ్చితంగా స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదుగుతుందని అందరూ అనుకున్నారు.
బట్ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో టాలీవుడ్ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్(Bollywood)లో అడపాదడపా సినిమాలు చేస్తూ తన గ్రాఫ్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మరి చూడాలి అక్కడైనా ఈ భామకు మంచి ఫేమ్ వస్తుందేమోనని. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న ఈ బ్యూటీ.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పడే జాకీ భగ్నానీ(Jockey Bhagnani)ని ప్రేమించి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ కూడా చేసుకుంది.
ప్రస్తుతం తన భర్తతో వైవాహిక జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా వాటిని తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా రకుల్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లూ కలర్ స్టైలీష్ డ్రెస్ ధరించి ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. అంతేకాకుండా వాటికి ‘మేము అందరినీ మా సొంతం చేసుకోవాల్సిన సమయం వచ్చింది’ అనే క్యాప్షన్ జోడించింది.
ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం రకుల్ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి. కాగా ఈ భామ ప్రస్తుతం ‘మేరే హస్బెండ్‌కి బివీ’(Mere Husband Ki Biwi) మూవీలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలో రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా ఈ బ్యూటీ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.