ఎంత డబ్బు ఇచ్చినా నాగచైతన్య సినిమాలో నటించనని చెప్పిన స్టార్ కిడ్.. సమంత వల్లేనా?

by Hamsa |   ( Updated:2024-03-19 07:28:38.0  )
ఎంత డబ్బు ఇచ్చినా నాగచైతన్య సినిమాలో నటించనని చెప్పిన స్టార్ కిడ్.. సమంత వల్లేనా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య జోష్ సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘ఏమాయ చేసావే’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరు పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. క్యూట్ కపుల్స్‌గా ప్రత్యేక ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నారు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం పాటు సాగలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి సమంత మయోసైటీస్‌ వ్యాధికి చికిత్స తీసుకుంది. ఇటీవల తాను వ్యాధి నుంచి కోలుకున్నట్లు తొందరలో రీఎంట్రీ కూడా ఇస్తానని ప్రకటించింది.

నాగచైతన్య విషయానికొస్తే.. ఈ యంగ్ హీరో వరుస చిత్రాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ షూటింగ్‌లో పాల్గోంటూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, నాగచైతన్య సినిమాలో ఓ స్టార్ హీరో కూతురు ఎప్పటికీ నటించనని చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పటి స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ నాగచైతన్య మూవీలో ఎన్నిసార్లు చాన్స్ వచ్చినా కానీ రిజెక్ట్ చేసిందట. అందుకు కారణం సమంతనే అని తెలుస్తోంది. సమంత- వరలక్ష్మి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే.. చై, సామ్‌ విడిపోవడంతో ఎప్పటికీ నాగచైతన్య సినిమాలో నటించనని అన్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన సమంత ఫ్యాన్స్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలని అంటున్నారు.

Read More..

ఆ క్రికెటర్‌తో కమల్ హాసన్ భార్య ఇంత ప్రేమాయణం నడిపిందా.. ఓరి దేవుడా !

Advertisement

Next Story

Most Viewed