‘బేబీ’ని మించిన ‘బేబి 2’ స్టోరీ.. సీక్వెల్‌లో ట్విస్టులు మామూలుగా లేవుగా..!

by sudharani |   ( Updated:2023-08-12 13:59:02.0  )
‘బేబీ’ని మించిన ‘బేబి 2’ స్టోరీ.. సీక్వెల్‌లో ట్విస్టులు మామూలుగా లేవుగా..!
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. నేటి యువత మనసుకు హత్తుకునేలా రూపొందిన ఈ మూవీ.. దాదాపుగా రూ. 70 కోట్లు వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే.. ‘బేబీ’ మూవీ సీక్వెల్ కావాలని చాలా మంది డైరెక్టర్‌ను అడుగుతున్నారు. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ, ‘బేబీ’ సీక్వెల్ ‘బేబీ-2’ స్టోరీ ఇదే అంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఇంతకి ఆ స్టోరీ ఏంటనేది చూసేద్దాం.

కట్ చేస్తే.. వైష్ణవికి పెళ్లై 20 ఏళ్ల తర్వాత ఆమె కూతురు అమెరికాలో ఓ కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఆ అబ్బాయి ఎవరో కాదు విరాజ్ కొడుకు. విరాజ్ తన పగను తీర్చుకునేందుకు కొడుకుని రంగంలోకి దింపి వైష్ణవి కూతురుని ప్రేమించేలా చేస్తాడు. వైష్ణవి కూతురు తన తల్లి నిజస్వరూపం తెలుసుకోవాలి, ప్రేమలో మోసపోవాలి అనేది విరాజ్ ప్లాన్. కానీ.. విరాజ్ కొడుకు మాత్రం వైష్ణవి కూతురుని నిజంగా ప్రేమిస్తాడు. దీంతో వైష్ణవి కూతురికి అసలు విషయం చెప్పేస్తాడు. అయితే.. వైష్ణవి కూతురు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే మనం ఇద్దరం దిగిన ఫొటోలు, వీడియోలు అన్ని డిలీట్ చెయ్యి అని చెప్పడంతో ఇక డిలీట్ చేస్తాడు విరాజ్ కొడుకు. ఇక్కడికి ఇంటర్వెల్ పూర్తి..

తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన వైష్ణవి కూతురు.. విరాజ్ కొడుక్కి కాల్ చేసి మనం పెళ్లి చేసుకుందాం ఇండియాకిరా అని పిలుస్తుంది. తన తండ్రికి అబద్దాలు చెప్పి ఇండియాకి వస్తాడు విరాజ్ కొడుకు. ఇండియాకు వచ్చిన విరాజ్ కొడుకుపై ఈవిటీజింగ్ కేసు పెట్టి జైలుకు పంపిస్తుంది వైష్ణవి కూతురు. ఇక తండ్రికి అబద్దం చెప్పి వచ్చా.. ప్రేమలో మోసపోయా బతకడం ఎందుకు అన్నట్లుగా సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు విరాజ్ కొడుకు. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు ఓ పెద్దాయన. ఆయన ఎవరో కాదు మన ఆనంద్.

అయితే.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది ఎవరో కాదు మన ఆనంద్ కొడుకేనట. చిన్నప్పుడు ఎగ్జిబిషన్‌లో తప్పిపోయిన ఆనంద్ కొడుకుని విరాజ్ పెంచుకుంటాడు. ఇక కొడుకు చేయిపై చిన్నప్పుడు ‘AV’ అని పచ్చబొట్టు వేయిస్తాడు ఆనంద్. ఈ రకంగానే అతడు తన కొడుకు అని గుర్తుపడతాడు. ఇక ఆనంద్ తన ఆటోలో కొడుకుని ఎక్కించుకుని వెళుతుంటే బ్యాక్ గ్రౌండ్‌లో ఓ కొటేషన్ కనిపిస్తుంది. మూవీ ఎండ్ అవుతుంది. ఇది అన్న మాట.. ‘బేబీ’ సీక్వెల్ స్టోరీ. చూశారా ఎన్ని ట్విస్ట్‌లు ఉన్నాయో. డైరెక్టర్ సాయి రాజేష్ ఏమో కానీ.. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు పెట్టి మరీ కథను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

Read More: జబర్దస్త్ రాకేష్ తన భార్య కోసం అంత పని చేశాడా..?

Advertisement

Next Story