- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'రాబిన్ హుడ్' నుంచి ఆ స్టార్ క్రికెటర్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఫ్రమ్ బౌండరీ టూ బాక్సాఫీస్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుంచి స్టార్ క్రికెటర్ లుక్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'ఫ్రమ్ బౌండరీ టూ బాక్సాఫీస్' అంటూ ఇండియన్ సినిమాలోకి డేవిడ్ వార్నర్(Devid Warner)కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది మూవీ టీమ్. అలాగే పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘గ్రౌండ్‌లో తనదైన ముద్ర వేసిన తర్వాత, ఇప్పుడు అతడు వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందని, అద్భుతమైన అతిథి పాత్రలో భారతీయ సినిమాకు వార్నర్‌ను పరిచయం చేస్తున్నామని ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో వార్నర్ లుక్ అటు క్రికెట్ ప్రియులను, ఇటు మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా 'రాబిన్ హుడ్' పోస్టర్‌లో డేవిడ్ వార్నర్ ఉబర్ కూల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అతను ఒక స్పాట్‌లైట్ కింద నిలబడి క్రిందికి చూస్తున్నాడు. వార్నర్ ఎలాంటి క్యామియో చేస్తున్నాడనేది తెలియదు కానీ.. సినిమాలో మాత్రం రియల్ లైఫ్ లుక్ తోనే కనిపించనున్నాడని అర్థమవుతోంది.