Sai Dharam Tej: ఆ విషయం ఇప్పుడు బాధిస్తుంది.. మెగా హీరో పోస్ట్

by Hamsa |
Sai Dharam Tej: ఆ విషయం ఇప్పుడు బాధిస్తుంది.. మెగా హీరో పోస్ట్
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) 2023లో ‘విరూపాక్ష’(Virupaksha) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ‘SDT-18’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి(Niranjan Reddy), చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అయితే సాయి ధరమ్ తేజ్ షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తున్నాడు. తాజాగా, ఆయన జిమ్‌లో తన కోచ్‌తో ఫొటో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేశాడు. ‘‘ఇది ఇప్పుడు బాధించినప్పటికీ. వెడెక్కించి మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది.’’ అని రాసుకొచ్చాడు. అయితే సాయి ధరమ్ తేజ్ SDT18 కోసం జిమ్‌లో తెగ కష్టపడిపోతున్నట్లు తెలుస్తోంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed