Hero surya : అమ్మ చేసిన ఆ తప్పే నన్ను హీరోగా మార్చింది.. స్టార్ హీరో సంచలన కామెంట్స్

by sudharani |
Hero surya : అమ్మ చేసిన ఆ తప్పే నన్ను హీరోగా మార్చింది.. స్టార్ హీరో సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య (Hero surya) త్వరలో ‘కంగువ’ (Kanguva)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దిశ పటానీ (Disha Patani) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా.. వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య అసలు తను సినీ ఫీల్డ్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు.

‘మా నాన్న కూడా ఆర్టిస్ట్. తర్వాత సినిమాల్లోకి వచ్చారు. మా నాన్న సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పటికీ మాకు అంతగా మూవీస్ గురించి తెలిసేది కాదు. ఎప్పుడు యాక్టర్ అవ్వాలని కూడా అనుకోలేదు. ఇండస్ట్రీకి చెందిన వారికి కూడా మా నాన్న ఎప్పుడు ఇంటికి తీసుకొచ్చేవారు కాదు. దీంతో మాకు ఎవరి గురించి తెలిసేది కాదు. కానీ నేను చిన్నప్పటి నుంచి కమల్ హాసన్‌(Kamal Haasan)కు మాత్రం పెద్ద ఫ్యాన్‌ను. ఆయన మూవీస్ ఫస్ట్ డే, ఫష్ట్ షో చూడటానికి బాగా ఇష్టపడేవాడిని. కానీ ఇండస్ట్రీ వైపు మాత్రం వెళ్లాలని ఎప్పుడు అనుకోలేదు. అయితే.. మా నాన్నకు తెలియకుండా మా అమ్మ ఓ తప్పు చేసింది.

మా అమ్మ త‌న వ‌ద్ద ఉన్న వడ్డాణం కుదువ పెట్టి రూ.25 వేలు డ‌బ్బు తీసుకుంది. ఈ విష‌యం మా నాన్నకి కూడా తెలియదు. అయితే ఈ డ‌బ్బును తిరిగి ఇద్దాం అనుకున్నప్పుడు పరిస్థితులు మాకు సహకరించలేదు. అలాంటి సమయంలోనే ఓ సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. ఇక డబ్బు కోసం ఎదురుచూస్తున్న క్రమంలో అవకాశం రాగానే ఓకే చెప్పాను. అది కూడా ఓ నటుడు తప్పుకోవడంతో ఆ సినిమాలో హీరోగా నాకు అవకాశం వచ్చింది. అలా సినిమాల్లో వచ్చి ఆ అప్పును తీర్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ సూర్య కామెంట్స్ వైరల్ కావడంతో.. మీ అమ్మ చేసిన తప్పు (అప్పు) కారణంగా ఈ రోజు మాకు ఓ స్టార్ హీరో దొరికాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు సూర్య ఫ్యాన్స్.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed