- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓటీటీ సినిమాతో స్టార్ హీరో తనయుడి సినీ ఎంట్రీ.. .. హీరోయిన్ ఎవరంటే?

దిశ, సినిమా: స్టార్ కిడ్స్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ తమ టాలెంట్‌ను నీరూపించుకుంటున్నారు. తమ నటనతో ప్రేక్షకులను మైమరిపిస్తున్నారు. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను కరణ్ జోహార్(Karan Johar) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సునీల్ శెట్టి(Sunil Shetty), దీయా మీర్జా, జుగల్ హన్సరాజ్, మహిమా చౌదరి(Mahima Chaudhary) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ మూవీ ‘నడానియన్’ పేరుతో రాబోతుండగా.. ఇందులో దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్(Khushi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. షావునా గౌతమ్(Shawuna Gautam) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ సంస్థ ఈ విషయాన్ని వెల్లడిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ‘నడానియన్’ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కానీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించకుండా త్వరలోనే అంటే సస్పెన్స్‌లో ఉంచింది.
లవ్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఉప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. సైఫ్ అలీఖాన్ మాజీ భార్య అమృతా సింగ్ తనయుడు ఇబ్రహీం. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయన కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇటీవల సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్‌లో జాయిన్ చేసి ట్రీట్‌మెంట్ ఇప్పించారు. అతనికి సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం సైఫ్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.