- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sai Dharam Tej : మా అందరికీ స్ఫూర్తినిస్తు్న్నారు.. స్టార్ హీరోపై ప్రశంసలు కురిపించిన సాయి ధరమ్ తేజ్

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రజెంట్ వరుస చిత్రాలు చేస్తున్నాడు. అలాగే నిత్యం సోషల్ మీడియా (Social media)లో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో సందడి చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)పై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా.. ‘అజిత్ సార్!! మరో మైలురాయిని సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. మీరు మీ ఇష్టాన్ని హృదయపూర్వకంగా అనుసరించారు. అలాగే ఈ రోజు గొప్ప విజయాన్ని ప్రపంచానికి చూపించారు. మా కలలను మేము సాధించే దిశగా మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. ఇంకా పెద్ద స్థాయిలో మీ కలను మీరు చేరుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పోర్చే 992 కేటగిరీలో తన టీమ్‌తో 3వ స్థానంలో నిలిచాడు. దుబాయ్ 24H సిరీస్‌లో 23వ ప్లేస్‌లో నిలిచింది. దీంతో ప్రజెంట్ ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Ajith Sir!! Hearty congratulations on achieving another milestone
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 12, 2025
You followed your passion with all your heart and showed the world today with a grand win. You inspire us all to chase our dreams. Dream big. Win big.#AjithKumarRacing #24HDubai2025 pic.twitter.com/IlgcMhlOAF