Sai Dharam Tej: ఆకట్టుకుంటోన్న సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్&టైటిల్

by Anjali |   ( Updated:2024-12-13 02:57:45.0  )
Sai Dharam Tej: ఆకట్టుకుంటోన్న సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్&టైటిల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తాజాగా ‘SDT 18’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌లో రూపొందుతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వం వహిస్తున్నారు. 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌(History backdrop)లో తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌(Prime Show Entertainments banner)పై చైతన్య రెడ్డి(Chaitanya Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy)లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి తాజాగా సాయి దుర్గా తేజ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

అంతేకాకుండా మేకర్స్ ఈ చిత్ర టైటిల్ కూడా ఖరారు చేసి.. మెగా ఫ్యాన్స్‌లో ఆనందం నింపారు. సంబరాల ఏటిగట్టు(Sambarala Etigattu) అని సినిమా పేరు పెట్టారు. అలాగే గ్లింప్స్ చూసినట్లైతే.. నువ్వు ఎదిగిన ఎత్తు నీది కాదు సామీ అహానిది’ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఇందులో శ్రీకాంత్(Srikanth) వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. అదిరిపోయిన యాక్షన్ సన్నివేశాల్లో కత్తితో హీరో మారణ హోమం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఏటిగట్టు సాక్షిగా చెబుతుండా ఈసారి నరికానంటే ఈ సారి అరుపు గొంతులోంచికాదు.. తెగిన నరాల్లోంచి వస్తుంది అని సాయి ధరమ్ తేజ్ డైలాగ్ చెబుతాడు. గ్లింప్స్‌లో ఈ డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం సంబ‌రాల ఏటిగ‌ట్టు నుంచి విడుదలైన గ్లింప్స్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Advertisement

Next Story