ఫోన్‌లో ఆ వీడియోలు చూస్తూ మూడ్ తెచ్చుకుంటున్న Sai Dharam Tej .. ఎందుకో తెలుసా!

by Hamsa |   ( Updated:2023-08-23 03:59:30.0  )
ఫోన్‌లో ఆ వీడియోలు చూస్తూ మూడ్ తెచ్చుకుంటున్న Sai Dharam Tej .. ఎందుకో తెలుసా!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి హోదాలో ఉన్నారు. అయితే ఇటీవల సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ కావడంతో కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకున్నాడు. ఈ మధ్య కాలంలో ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను సినిమా షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఏదైనా సన్నివేశంలో నటించే మూడ్ రావాలంటే అలాంటి వీడియోలు చూస్తాను. నేను సినిమాల్లో నటించే కంటే ముందు కామెడీ వీడియోలు చూస్తూ సరదాగా కాసేపు నవ్వుకుంటాను. ఆ తర్వాత నటించడానికి ఫుల్ జోష్ వస్తుంది. నాకు ఏదైనా సన్నివేశం లో నటించే ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడల్లా ఫోన్ తీసి వీడియోలు చూస్తూ కాసేపు రిలాక్స్ అయి షూటింగ్ కంప్లీట్ చేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed