Vijay Deverakonda: విజయ్‌తో రొమాన్స్ చేయబోతున్న రష్మిక.. పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్న నెటిజన్లు

by Hamsa |
Vijay Deverakonda: విజయ్‌తో రొమాన్స్ చేయబోతున్న రష్మిక.. పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన రౌడీ హీరోగా మారిపోయారు. ఈ మూవీ తర్వాత ఆయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక గీతా గోవిందం, మహానటి వంటి చిత్రాలతో హిట్ అందుకున్నారు. అలాగే తన నటనతో క్రేజ్ పెంచుకున్నాడు. ఇక 2022లో విజయ్ ‘లైగర్’(Liger) చిత్రంతో భారీ డిజాస్టర్‌ను చవిచూశారు. భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీసు వద్ద రాణించలేకపోవడంతో ఒక్కసారిగా క్రేజ్ పడిపోయింది. ఇక 2023లో ఆయన సమంత, కలిసి నటించిన ‘ఖుషి’ సూపర్ హిట్ అందుకుంది. దీంతో గత ఏడాది ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ఈ సినిమా థియేటర్స్‌లో మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది.

ప్రస్తుతం విజయ్ ‘VD-12’ చేస్తున్నారు. దీనిని గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే.. ఇటీవల విజయ్ ‘VD-14’ పనులు స్టార్ట్ అయినట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ మూవీకి రాహుల్ సంక్రిత్యాన్ (Rahul Sankrityan)దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తి అయింది.

త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, VD-14 మూవీలో హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారాయి. విజయ్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తున్నట్లు టాక్. ఇది పీరియాడిక్ యాక్షన్ ఫిలిం అని తెలుస్తుంది. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథగా, విజయ్ దేవరకొండని ఓ యోధుడిగా చూపించబోతున్నారు అని సమాచారం.

ఈ సినిమా ఎవరూ చెప్పని భారతదేశ వలస చరిత్రపై ఇప్పటివరకు తీసిన అత్యంత శక్తివంతమైన సినిమాలలో ఒకటి అవుతుందని రాహుల్ అంటున్నారు. కాగా, ఇప్పటికే విజయ్, రష్మిక గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి చిత్రాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో మూవీ రాబోతుండటంతోపెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరు ప్రేమించుకుంటున్నారనే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరు స్పందించకపోవడంతో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.

Next Story