‘జాట్’ నుంచి రణ్‌దీప్ హుడా ఫస్ట్ లుక్ రిలీజ్.. చేతిలో మొండెంతో సుస్సు పోయిస్తున్నాడుగా..

by Kavitha |   ( Updated:2025-03-10 13:10:24.0  )
‘జాట్’ నుంచి రణ్‌దీప్ హుడా ఫస్ట్ లుక్ రిలీజ్.. చేతిలో మొండెంతో సుస్సు పోయిస్తున్నాడుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT). పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), వై రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే పలు హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి ఎస్ తమన్(Thaman) బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఇందులో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ‘జాట్’ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా(Randeep Hooda) ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అంతేకాకుండా క్యారెక్టర్‌కు సంబంధించిన గ్లింప్స్ మార్చి 10వ తేదీన ఉదయం 10:30 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలో రణ్‌దీప్ హుడాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ.. జాట్ ప్రపంచం నుండి భయంకరమైన రణతుంగగా అద్భుతమైన రణ్‌దీప్ హుడాని పరిచయం చేస్తున్నాము అని మేకర్స్ వెల్లడించారు.

ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. కుర్చిలో రణ్‌దీప్ హుడా కూర్చోని హుందాగా బీడీ కాలుస్తున్నాడు. అయితే ఒంటిమీద షర్ట్ లేకుండా కేవలం లుంగీ మాత్రమే ఉంది. అలాగే అతని చేతిలో ఒక వ్యక్తి తల భాగం మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ భయంకర లుక్‌లో దర్శనమిచ్చి అతను సుస్సు పోయిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Next Story

Most Viewed