- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ram Charan: ఆ సమయంలో మేమంతా ఎంతో భయపడ్డాము.. గ్లోబల్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్

దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, డైరెక్టర్ రోహిత్ కూపీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘SDT18’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రైమ్ షో బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1947 హిస్టరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది.
ఇదిలా ఉంటే.. సరికొత్తగా తీస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ‘కార్నేజ్ లాంచ్’ పేరిట హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ‘SYG’ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో పోరాట యోధుడిగా పదేళ్ళు పూర్తి చేసుకున్న సాయి దుర్గా తేజ్‌కు శుభాకాంక్షలు. ఒక మంచి నటుడిగానే కాక ఒక మంచి వ్యక్తి, ఒక మంచి తమ్ముడు, మంచి అన్న.. కొడుకు.. అల్లుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. అవన్నీ మీకు బాగా తెలుసు. తేజ్ బాగా కష్టపడతాడు. ప్రతి పాత్రకు తాపత్రయ పడతాడు. మీ అందరి సహకారంతో సాయి దుర్గా తేజ్ ఈ స్థాయిలో ఉన్నాడు. అసలు తేజ్ ఇలా మన ముందు ఇలా నిలిచి ఉన్నాడంటే ఆంజనేయ స్వామి మీద ఒట్టు వేసి చెప్తున్నా మీ ఆశీర్వాదంతోనే ఇలా ఉన్నాడు. ఆ రోజును నేను గుర్తు చేయాలనుకోవడం లేదు. కానీ, ఇది పునర్జన్మ.
ఆ జన్మ మీ ఆశీర్వాదమే ఇచ్చింది. సాయి దుర్గా తేజ్‌కి యాక్సిడెంట్ అయిన సమయంలో మేమందరం ఎంత భయపడ్డామంటే ఆ భావనకు ఒక అర్థం కూడా చెప్పలేక పోతున్నా. గుండెను అలా పట్టుకొని మేమందరం మూడు నెలలు చాలా చాలా కష్టమైన సమయాన్ని గడిపాము. మేం చేసిన ప్రయత్నమంతా దండం పెట్టుకోవడం తప్ప ఏం చేయలేకపోయాము. ఈ తేజ్ మా తేజ్ కాదు. ఆ పెద్ద ప్రమాదం నుంచి మళ్లీ ఇక్కడ నిలిచి ఉన్నాడంటే అది మీ తేజ్. మీరు జన్మనిచ్చిన తేజ్. మీరు ఆశీర్వాదం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు’ అంటూ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.