- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ram Charan: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన రామ్ చరణ్.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం?

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇటీవల ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ సెట్‌కు తన కూతురు క్లిన్ కారాను తీసుకెళ్లిన ఫొటోను షేర్ చేసి వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉంటే.. తాజాగా, రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్(Allu Arjun)ను అన్‌ఫాలో చేయడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య బంధుత్వం కంటే ఎక్కువ ఫ్రెండ్‌షిప్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. అలాంటిది ఇప్పుడు మెగా కజిన్స్ మధ్య ఏం జరిగింది? ఎందుకు అన్‌ఫాలో అవుతున్నారనేది అర్థం కాక అంతా షాక్‌కు గురవుతున్నారు.
కొన్ని రోజుల క్రితం వరకు ఫాలో అయిన ఆయన సడెన్‌గా అన్‌ఫాలో చేయడంతో మెగా హీరో వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కూడా బన్నీని అన్‌ఫాలో చేసిన విషయం తెలిసిందే. ఇక ఒక్కరొక్కరుగా ఆయనను దూరం పెడుతుండటంతో మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు నెట్టింట పలు పుకార్లు షికార్లు చేస్తున్నారు. అయితే అల్లు శిరీష్‌ను మాత్రం గ్లోబల్ స్టార్ ఫాలో అవుతున్నారు. ఇక ఇటీవల అల్లు అరవింద్, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’(Game Changer) డిజాస్టర్ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేయడంతో అవి కాస్త తీవ్ర దుమారం రేపాయి. ఇక ఈ విషయంపై అల్లు అరవింద్ తనకు ఉన్న ఏకైక మేనల్లుడు అని కొడుకుతో సమానం అని వివాదానికి చెక్ పెట్టారు.
ఇక ఈ కామెంట్లు చేసిన క్రమంలోనే రామ్ చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అంతా అయోమయంలో పడిపోయారు. అయితే రామ్ చరణ్ అన్‌ఫాలో చేసినప్పటికీ ఆయన భార్య ఉపాసన మాత్రం అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలను ఫాలో అవుతోంది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ఇటీవల ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ హిట్ అందుకోలేక పోయారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘RC-16’లో చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.