రేజ్ ఆఫ్ రుద్ర టైటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్

by Hamsa |
రేజ్ ఆఫ్ రుద్ర టైటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: కార్తికేయ-2(Kartikeya-2), వెంకీ మామ, ఓ బేబీ, ఢమాకా న్యూ సెన్స్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తోంది. తాజాగా, తమ బ్యానర్‌‌పై రాబోతున్న 49వ చిత్రం తెరకెక్కుతున్న అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్ బి ధనంజయ(Dhananjaya) ఈ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచం కాబోతున్నాడు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad), క్రితి ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇందులో శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్(Ganesh) హీరోగా నటిస్తుండగా.. యూనిక్ స్టోరీతో తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమా పీపుల్ మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న 49 ప్రాజెక్ట్ కావడంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్, గ్లింప్స్ వచ్చే ఏడాది జనవరి 2న రాబోతున్నట్లుX ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా మంటలతో ఉన్న త్రిశూలం పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘‘మొదటి సంగ్రహావలోకనం చూడటానికి సిద్ధంగా ఉండండి. దైవిక శక్తి యొక్క విస్ఫోటనం - రేజ్ ఆఫ్ రుద్ర’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఇందులో నటీనటుల గురించి మేకర్స్ వెల్లడించలేదు.

Next Story

Most Viewed