- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Radhika Sarathkumar: ఆ గాయం వల్ల రెండు నెలలు నరకం అనుభవించాను.. చిరంజీవి హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్(Radhika Sarathkumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. మన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరసన పదుల సంఖ్యలో నటించి అలరించింది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక స్టార్ హీరో శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. అయితే వీరికి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) అనే పాప కూడా ఉంది. ఆమె కూడా యాక్టర్. ప్రస్తుతం ఆ భామ కూడా టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ వావ్ అనిపించుకుంటుంది.
ప్రస్తుతం ‘శివంగి’(Shivangi), ‘కూర్మ నాయకి’(Kurma Nayaki) వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇక రీసెంట్‌గానే బిజినెస్ మ్యాన్ నికోలయ్ సచ్‌దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా అతనికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ రాధికకు గాయమైనట్లు వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆమె తన గాయం గురించి వివరిస్తూ సోషల్ మీడియా(Social Media) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ఉమెన్స్ డే సందర్భంగా మహిళలు ఎప్పుడూ బలంగా ఉండాలని కోరుతూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.
‘రెండు నెలలు చాలా బాధగా గడిచాయి. సినిమా లొకేషన్‌లో నా మోకాలికి గాయం అయింది. సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. నొప్పి తగ్గడం కోసం ఎన్నో టాబ్లెట్స్ వాడాను. ఎన్నో థెరపీలు చేయించుకున్నాను. కానీ, ఫలితం కనిపించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేయించుకున్నాను. సర్జరీకి ముందు ఆ నొప్పి భరిస్తూనే అంగీకరించిన సినిమాలు పూర్తి చేశాను. పనిపై నా అంకిత భావం చూసి ఓ ఫ్రెండ్ షాక్‌కు గురయ్యాడు. ఇంత కష్టపడుతున్నావు.. ఆ నిర్మాతలు నీకు కృతజ్ఞతలు చెప్పారా అని అడిగాడు.
నేను అలాంటివి ఆశించలేదని అతనికి చెప్పాను. నా పనిపై మాత్రమే దృష్టి పెడతాను. ఇక సర్జరీ టైంలో నా భర్త నాకు గొప్ప సపోర్ట్ ఇచ్చారు. నన్ను చిన్న పిల్లలా చూసుకున్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే.. మహిళలు ఎప్పుడూ బలంగా, శక్తివంతంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవాలి’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also..
యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉమెన్స్ డే శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్