‘తండేల్’ మూవీ పైరసీ.. కేబుల్ ఆపరేటర్లకు నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2025-02-10 12:21:16.0  )
‘తండేల్’ మూవీ పైరసీ.. కేబుల్ ఆపరేటర్లకు నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని హీరో నాగ చైతన్య(Hero Naga Chaitanya) నటించిన ‘తండేల్’ మూవీ(Tandel movie) విజయవంతంగా ధియేటర్లలో ప్రదర్శించబడుతోంది. తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడంతో నిర్మాతలు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఈ సినిమా రిలీజైన 12, 14 గంటల్లోనే పైరసీ వచ్చేసింది. సినిమా మొత్తం ఆన్ లైన్‌లో దర్శనమిచ్చింది. దీంతో ఆ తర్వాత రోజు నుంచి సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ పరిణామంతో ‘తండేల్’ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు(Producers Allu Aravind, Bunny Vasu) ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ‘తండేల్’ మూవీ పైరసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.

సినిమాల పైరసీపై గతంలో ఫిల్మ్ ఛాంబర్ చర్యలు తీసుకుందని బన్నీ వాసు గుర్తు చేశారు. అప్పటి నుంచి సినిమా పైరసీ జరలేదని, కానీ ఈ మధ్య దారుణంగా పరిస్థితి తయారైందని నిర్మాత బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి(Sankranti) సందర్భంగా రిలీజైన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీ దారుణంగా పైరసీ చేశారని ఆరోపించారు. తాజాగా విడుదలైన ‘తండేల్’ మూవీని కూడా పైరసీ చేశారని, ఆర్టీసీ బస్సు(Rtc Bus)లో కూడా ప్రదర్శించారని తెలిపారు. సినిమా చాలా మంది కష్టమని, తండేల్ పైరసీ చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. తండేల్ సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేబుల్ ఆపరేటర్లపైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బన్నీ వాస్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story