‘బూమరాంగ్’ సినిమాలో ప్రశాంత్ వర్మ.. వైల్డ్ పోస్టర్‌తో షాకిచ్చిన మేకర్స్ (ట్వీట్)

by Hamsa |
‘బూమరాంగ్’ సినిమాలో ప్రశాంత్ వర్మ.. వైల్డ్ పోస్టర్‌తో షాకిచ్చిన మేకర్స్ (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బూమరాంగ్’(Boomerang). ఈ సినిమాలో శివ కందుకూరి(Shiva Kandukuri) కీలక పాత్రలో నటిస్తుండగా.. దీనికి ఆండ్రూ బాబు(Andrew Babu) దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మై3 మూవీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై లండన్ గణేష్, ప్రవీణ్ రెడ్డి ఊట్ల(Praveen Reddy Ootla) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ‘బూమరాంగ్’ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టర్‌కు ‘‘కర్మకు మెనూ లేదు, అయినప్పటికీ మీకు ఏం కావాలో వడ్డిస్తుంది’’ అనే క్యాప్షన్‌తో విడుదల చేయడంతో అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, ‘బూమరాంగ్’ మూవీ మేకర్స్ శివ కందుకూరి పుట్టినరోజు కావడంతో విషెస్ చెప్తూ ఆయన పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో ప్రశాంత్ వర్మ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే విడుదలైన పోస్టర్‌లో భయంకరమైన కళ్లతో కనిపించిన శివ.. ఓ నల్ల కుక్కను చేతిలో పట్టుకుని చుట్టూ శవాల ఉండగా.. వైల్డ్ లుక్‌తో కనిపించాడు. ఇక అది చూసిన వారు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు లుక్ అదిరిపోయిందని అంటున్నారు. కాగా, అనూ ఇమ్మాన్యుయేల్ సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు నాని ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్, రవితేజ(Ravi Teja), అల్లు శిరీష్(Allu Sirish), బెల్లంకొండ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాగచైతన్య వంటి హీరోలతో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇక 2023లో చివరగా ‘జపాన్’చిత్రంలో నటించిన ఆమె ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ ఇప్పుడు ‘బూమరాంగ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story

Most Viewed