‘SK-23’కు పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్.. వైల్డ్ లుక్‌లో భయపెడుతున్న స్టార్ హీరో

by Kavitha |   ( Updated:2025-02-17 06:39:04.0  )
‘SK-23’కు పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్.. వైల్డ్ లుక్‌లో భయపెడుతున్న స్టార్ హీరో
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(sivaKarthikeyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘అమరన్’(amaran) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar Periyasamy) దర్శకత్వం వహించాడు. దీంతో శివ కార్తికేయన్‌‌కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా ప్రస్తుతం ఆయన ‘పరాశక్తి’(Parasakthi) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sree Leela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. దీనికి సుధా కొంగర(sudha Kongara) దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే కార్తికేయన్ ‘SK-23’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. మురుగదాస్(Muruga Das) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్(Sri Lakshmi Movies Banner) పై నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీలో శివ కార్తికేయన్ సరసన కన్నడ బ్యూటీ రక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

అయితే నిన్న Sk-23 కి సంబంధించిన టైటిల్, గ్లింప్స్ ఈరోజు ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు మూవీ టీమ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘Sk-23 సినిమాకు ‘మదరాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేశాము.. భారీ చర్యకు రంగం సిద్ధమైంది. HAVOC ప్రారంభం’ అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. యాంగ్రీ బర్డ్ రూపంలో శివకార్తికేయన్ చాలా వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. అయితే ఇంతటి వైల్డ్‌లుక్‌లో మనం ఆయనని ఇప్పటి వరకు చూడకపోవడం గమనార్హం. ప్రజెంట్ ఈ పోస్టర్ కూడా నెట్టింట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

Next Story

Most Viewed