OHO RATHAMMA SONG: ట్రెండ్ అవుతున్న డైలాగ్‌ను వాడిన విశ్వక్ సేన్.. నెట్టింట ఆకట్టుకుంటున్న కోయ్ కోయ్ కోడిని కోయ్ లిరిక్స్

by Kavitha |
OHO RATHAMMA SONG:  ట్రెండ్ అవుతున్న డైలాగ్‌ను వాడిన విశ్వక్ సేన్.. నెట్టింట ఆకట్టుకుంటున్న కోయ్ కోయ్ కోడిని కోయ్ లిరిక్స్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila) . ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్‌, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ అయినటువంటి ‘ఓహో రత్తమ్మ.. నాగ రత్తమ్మ’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అయితే ఈ సాంగ్ మధ్యలో బాగా వైరల్ అయిన ‘కోయ్ కోయ్ కోడిని కోయ్’ అనే లిరిక్స్ వాడటం ఇప్పుడు హైలెట్ అవుతోంది. కాగా దీనికి పెంచల్ దాస్ లిరిక్స్ అందిస్తూ పాట పాడారు. అలాగే మధు ప్రియ కూడా ఈ సాంగ్ పాడింది.

కాగా విశ్వక్ సేన్ ‘వెళ్లి పోమాకే’(Vellipomake) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం 'లైలా' మూవీతో పాటు ఫంకీ (Funkey) సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Next Story