- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నేను ఎంతమందితో నటించినా.. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరోయిన్ మాత్రం ఆమెనే.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూ తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎంతో మంది యంగ్ హీరోస్ వస్తున్న.. ఇప్పటికీ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. తన కెరీర్‌లో 150 కు పైగా సినిమాల్లో నటించి అంచెలంచెలుగా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకుంటూ వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇన్ని సినిమాలు చేసిన ఇతను.. దాదాపు పదుల సంఖ్యలో హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని ఉంటాడు. అయితే అంత మందితో నటించిన అతని ఫేవరేట్ హీరోయిన్ మాత్రమే ఆమెనే అట. ఓ ఇంటర్వ్యూలో చిరు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవిను తను నటించిన హీరోయిన్స్‌లో ఆల్‌టైమ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి చిరంజీవి నేను నటించిన హీరోయిన్స్‌లో ఒక్కోక్కరిలో ఒక్కోక్క క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీకి నేను ఫిదా. హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కో విషయంలో ఎక్స్పర్ట్స్. రాధ గురించి చెప్పాలంటే తన డాన్స్ సూపర్. శ్రీదేవి అయితే ఓవరాల్ పర్సనాలిటీ పరంగా అద్భుతం. సుమలత హోమ్లీ రోల్స్‌కి కేరాఫ్ అడ్రస్. సుహాసిని మరో విధంగా గొప్ప. అలా ప్రతి హీరోయిన్‌లో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీకి నేను ఫ్యాన్‌ని. అయితే మహానటి సావిత్రి, జయసుధ, వాణిశ్రీ తర్వాత విలక్షణత కలిగిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఆమె రాధిక. ఆమె ఎమోషన్, కామెడీ, క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రల్లోనూ నటించగలదు. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగలదు. అందుకే నాకు రాధిక అంటే చాలా ఇష్టం అంటూ చిరంజీవి వెల్లడించారు. అలా చిరు తన ఫేవరెట్ హీరోయిన్ రాధిక అని చెప్పకనే చెప్పేశారు. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన సిసిమాలు ఎంతగా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ అనే మూవీతో మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
Read more : ఆచార్య పాద ఘట్టం.. దేవర సముద్ర మట్టం అంటూ ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్.. మరి సినిమా హిట్ కొడుతుందా?