ఆ స్టెప్స్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కంటతడి పెట్టుకున్న సాయి పల్లవి(పోస్ట్)

by Kavitha |   ( Updated:2025-02-18 12:17:44.0  )
ఆ స్టెప్స్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కంటతడి పెట్టుకున్న సాయి పల్లవి(పోస్ట్)
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని చిత్రంపై భారీ అంచనాలు పెంచగా.. సాంగ్స్ మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలా విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయింది.

ఇక ఫస్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్‌కి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అలాగే దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) తన మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు. అంతే కాకుండా కలెక్షన్ల విషయంలోనూ సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా ఇంతటి విజయం సాధించడంతో ప్రస్తుతం మూవీ టీమ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సాయి పల్లవి ‘హైలెస్సో హైలాస్సా’(Hilesso Hilessa) సాంగ్‌లో అదిరిపోయిన స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు చేసిన డ్యాన్స్ స్టెప్పులను చాలా మంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వాటిని తండేల్ మూవీ టీమ్ తన అఫీషియల్ అకౌంట్‌లో కూడా రీ పోస్ట్ చేసింది. అయితే ఈ స్టెప్స్ ఎంతగా హైలెట్ అయ్యాయో అంతే గనం ట్రోల్స్ కూడా జరుగుతుంది. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో హైలెస్సో హైలెస్సా సాంగ్‌ థియేటర్లో ప్లే అవుతుంటే.. కొంత మంది బాయ్స్ కొంచెం వెటకారంగా డ్యాన్స్ చేశారు. అయితే ఈ వీడియోకి సాయి పల్లవి కంటతడి పెడుతున్న ఫొటోను యాడ్ చేసి ‘రేయ్ ఎవర్రా మీరంతా’ అనే డైలాగ్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed