- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ పార్ట్‌కు రూ.2.4కోట్ల డైమండ్ ధరించిన గ్లోబల్ క్వీన్.. మేడం చాలా రిచ్ గురూ అంటున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(PRIYANKA CHOPRA) మనందరికీ సుపరిచితమే. తమిళ చిత్రసీమ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలు అందుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి, మెప్పించింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అతి తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్‌గా నిలిచింది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్(Hollywood)లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. గ్లోబల్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక హాలీవుడ్ స్టార్ నిక్ జోనస్(Nick Jonas) ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ నేషనల్ స్టార్‌గా ఉన్న అమ్మడు .. ఇప్పుడు హాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారింది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కబోతున్న ఎస్ఎస్‌ఎమ్‌బీ(SSMB-29) మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
బేసిక్‌గా ప్రియాంకచోప్రా ఎప్పుడు ట్రెండీ వేర్‌లో లగ్జరీగా కనిపిస్తుంటది. అయితే రీసెంట్‌గా విమానాశ్రయంలో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. అక్కడ బ్లాక్ అండ్ బ్లూ కలర్ అవుట్ ఫిట్ బ్లాక్ గాగుల్స్‌లో సూపర్‌గా కనిపించింది. కానీ, ఆమె ధరించిన డైమండ్ బెల్లీ బటన్ రింగ్ మాత్రం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే నివేదికల ప్రకారం, దీని ధర అక్షరాల రూ. 2.7 కోట్లు. అన్ని కోట్లు వెచ్చించి బెల్లీ పార్టుకు ధరించిందంటే ఆమె రేంజ్ ఏమాత్రం ఉంటుందో తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మేడం చాలా రిచ్ గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read More..